![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -152 లో..... శైలు, కేశవ ప్రేమించుకున్న విషయం శైలు వాళ్ళ అన్నయ్య సురేష్ కి తెలుస్తుంది. ఇక తన ఫ్రెండ్స్ ని తీసుకొని నారాయణ ఇంటికి గొడవకి వెళ్తాడు. అక్కడ నారాయణ, మాధవకి శైలు, కేశవ ప్రేమ గురించి తెలుస్తుంది. నీ చెల్లి మా తమ్ముడు దగ్గరికి వచ్చిందా.. నా తమ్ముడు నీ చెల్లి దగ్గరికి వచ్చాడా అని చక్రి వాళ్లపై కోప్పడతాడు. నీ చెల్లి నా ఇంటికి కోడలు అవుతుందని నారాయణ అనగానే అసలు దీన్ని ఎవడైనా ఇల్లు అంటారా.. ఇది లాడ్జ్ అని సురేష్ అంటాడు. ఇంకోసారి నా చెల్లి వెంట నీ తమ్ముడు పడితే చంపేస్తానని సురేష్ అనగానే నా తమ్ముడిని చంపేస్తా అంటున్నావా అని చక్రి వాడి కాలర్ పట్టుకొని గొడవ చేస్తాడు.
ఆ తర్వాత మహా, చక్రి లాయర్ దగ్గరికి వెళ్తారు. మాకు విడాకులు కావాలని మహా చెప్తుంది. మీ ఆయన కొడతాడా, తిడతాడా అని లాయర్ అడుగుతాడు. చాలా మాంచోడు అని మహా చెప్తుంది. మరి ఎందుకు విడాకులు అని లాయర్ అడుగుతాడు. మాకు కావాలంతే అని మహా చెప్తుంది. ఇద్దరికి చెరొక ఫామ్ ఇచ్చి ఫిలప్ చెయ్యమంటాడు. అది అతనికి ఇచ్చేసి ఇద్దరు బయటకు వస్తారు. అక్కడ ఒక యూట్యూబ్ ఛానెల్ వాళ్లు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మహా గురించి అడిగిన అన్ని క్వశ్చన్స్ కి చక్రి కరెక్ట్ గా సమాధానమిస్తాడు. మహా మాత్రం చక్రి గురించి తప్పు చెప్పిన వాటిని చక్రి కవర్ చేస్తాడు. మీ జంట బాగుంది మీరు ప్రైజ్ మనీ అయిదు వేలు గెలుచుకున్నారని మహా, చక్రి వాళ్ళకి ఆ ఛానెల్ వాళ్ళు ఇస్తారు. మరొకవైపు కేశవ ఇంటికి వస్తాడు. అతనికి సురేష్ వచ్చి గొడవ చేసింది తెలియకుండా జాగ్రత్త పడాలనుకుంటారు కానీ కేశవకి తెలుస్తుంది. దాంతో కేశవ కోపంగా బయటకు వెళ్తాడు. అప్పుడే శైలు ఫోన్ చేస్తుంది. మొదట కట్ చేసినా చివరకు లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు కేశవ.
నువ్వు ప్రేమించమని చుట్టూ తిరిగావు.. ఇప్పుడు మీ వాళ్ళు తిరుగుతున్నారని శైలుని తిడుతాడు. మీ అన్నయ్య గొడవకి వచ్చాడాట.. అందుకే ఈ లవ్ ఇవన్నీ వద్దన్నానని శైలుని కేశవ కోప్పడతాడు.ఆ తర్వాత సురేష్ వెళ్లి గొడవ చేసిన విషయం వాళ్ళ అమ్మానాన్నకి చెప్తుంది శైలు. దాంతో ఇంట్లో గొడవ చేస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు చక్రి, కేశవ ఎక్కడ అని మాధవ అడుగుతాడు. గొడవకి వెళ్ళాడేమో అని మాధవ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత చక్రి, కేశవ ఇద్దరు కలిసి శైలుని కలవడానికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |